నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకను వైజాగ్‌లో నేడు (సెప్టెంబర్ 17) కలకాలం గుర్తుండి పోయేలా భారీ సెట్ వేసి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలీ మాట్లాడుతూ.. మూడు నాలుగు తరాల నటులతో నటించి తిరుగులేని నటుడనిపించుకున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వయస్సు ఎంతో తెలుసా? అని ప్రశ్నించారు. మోహన్‌బాబు వయస్సు జస్ట్ 50 అంటూ ఆయన చమత్కరించారు. సినీ పరిశ్రమకు మోహన్‌బాబు వచ్చి 40 ఏళ్లు అయితే ఆయన వయస్సు 50 ఏళ్లంటూ నవ్వులు పూయించారు.
విశాఖ ప్రజలకు సుబ్బిరామిరెడ్డి మీద అభిమానం, మోహన్‌బాబు పట్ల ఉన్న ప్రేమ అసమానమని, అందుకే ఇక్కడి ప్రజల మధ్య ఈ వేడుకలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. మోహన్‌బాబు తలపై నాలుగు వెంట్రుకలు రాలేయేమో కానీ...ఆయన ఇప్పటికీ ఎనర్జిటిక్ నటుడేనంటూ ఆలీ ప్రశంసల జల్లు కురిపించారు.