భారతీయ చరిత్రలో కీలకమైన, మరచిపోయిన సంఘటన విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయనున్నారు. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా, ఒక ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తోంది. భారతీయ వారసత్వ మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుంది.
ఈ చిత్రానికి HIT 1, HIT 2, గీత గోవిందం, సైంధవ్ చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభావంతులైన కోర్ టీమ్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందుతోంది. నటీనటులు, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.