నా తొలి పాట ఇక్కడే పుట్టింది : చంద్రబోస్‌

శుక్రవారం, 24 మార్చి 2023 (15:33 IST)
Chandra Bose, sureshbabu
ఆస్కార్‌ అవార్డు నాటునాటు పాటకు పొందిన తర్వాత తొలిసారి గీత రచయిత చంద్రబోస్‌ రామానాయుడు స్టూడియోకు వెళ్ళారు. శుక్రవారంనాడు రికార్డింగ్‌ సందర్భంగా వెళ్ళిన ఆయన రాక తెలిసిన డి. సురేష్‌బాబు సాదరంగా ఆహ్వానించి చిరుసత్కారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
 
Chandra Bose, sureshbabu
1995లో డా. డి. రామానాయుడుగారిని ఇదే రూమ్‌లో కలిశాను. అప్పట్లో ఇది గ్లాస్‌ రూమ్‌. తాజ్‌ మహల్‌ సినిమాకు పాటలను రాసి ఇక్కడే వినిపించాను. సంగీత దర్శకురాలు శ్రీలేఖ కూడా వున్నారు. మొదటి మొదటిసారి నేను పాటను విన్నవెంటనే ఆయన చక్కని తెలుగు పదాలు ఉట్టిపడ్డాయి అని కితాబు ఇచ్చారు. శ్రీలేఖగారికి కూడా బాగా నచ్చింది. సినిమా విడుదల తర్వాత ఆ పాటకు ఎంతో పేరు వచ్చింది. అలా నాయుడుగారితో నా జర్నీ మొదలైంది. అది ఆస్కార్‌ స్థాయికి వెళ్ళేలా చేసింది. పై నున్న నాయుడుగారి ఆశీర్వాదం కూడా వుంది. ఆయన వారసుడిగా డి.సురేష్‌బాబుగారు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా శాయశక్తులా వారి సినిమాలకు మంచి పాటలు రాస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు చంద్రబోస్‌ను భుజం తట్టి శుభాకాంక్షలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు