శృంగార చిత్రాల్లో నటించేందుకు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన నటి అకస్మాత్తుగా అదృశ్యం కావడంపై మాలీవుడ్‌లో చర్చకు కారణమైంది. ఇంకా 2007లో ఓ సెక్స్ రాకెట్లో చిక్కుకుని బెయిలుపై విడుదలైన రేష్మ ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. ప్రస్తుతం రేష్మ ఎక్కడుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిస్టరీగా మారిన ఆమె అదృశ్యంపై తాజాగా సహనటి షకీలా స్పందించింది. రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. గత చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు రేష్మ ప్రయత్నిస్తోందని షకీలా వెల్లడించింది.