ఇటీవలి ఇంటర్వ్యూలో, జాన్వీ కపూర్ తన రాబోయే దక్షిణాది అరంగేట్రం దేవర గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవర చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ చిత్రం ద్వారా తన మూలాలకు దగ్గరగా అయ్యేలా తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పింది. శ్రీదేవి తన దక్షిణాది అరంగేట్రం జూనియర్ ఎన్టీఆర్ తాత N.T రామారావుతో ప్రారంభించారు.
జాన్వీ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మాహి, దేవర, ఉలాజ్ వంటి సినిమాలు చేస్తుంది. తనకు తెలుగు నేర్చుకునేలా డైలాగ్ లు అన్నీ ముందుగా వస్తున్నాయి. నేను త్వరలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా తెలుగులో మాట్లాడతాను అంటూ నర్మగర్భంగా చెప్పింది.