తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ సినీనటుడు నాగార్జున అక్కినేని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.
ఈ ఆరోపణలను నాగార్జున, అతని కుటుంబం, సమంతలు తీవ్రంగా తిరస్కరించారు. అందరూ వాటిని నిరాధారమైనవని ఖండించారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సురేఖపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.
దీంతో ఈ కామెంట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, అక్కినేని కుటుంబం చట్టపరమైన చర్యలతో ముందుకెళ్తోంది. ఈ మేరకు సురేఖకు నోటీసు జారీ చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారి తరపున ప్రత్యేక నోటీసును కూడా రూపొందించింది.
సురేఖ చేసిన షాకింగ్ వాదనలలో నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపడానికి బదులుగా సమంతను తన వద్దకు పంపమని కేటీఆర్ కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమంత నిరాకరించడంతో, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాపని సురేఖ వ్యాఖ్యానించారు. కేటీఆర్ డిమాండ్‌కు అనుగుణంగా సమంతపై నాగార్జున ఒత్తిడి చేశారని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నాగార్జున ఆగ్రహానికి కారణమయ్యాయి.