Akhanda 2 : నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం డేట్ ఫిక్స్

డీవీ

బుధవారం, 11 డిశెంబరు 2024 (18:23 IST)
Akhanda 2 release poster
బోయపాటి శీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా తాజాఅప్ డేట్ వచ్చేసింది. ఈరోజు సాయంత్రం 5.30గంటల తర్వాత రిలీజ్ డేట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదలచేసింది.  2025 సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది.
 
రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 'అఖండ 2: తాండవం' బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం సందర్భంగా డేట్ ఫిక్స్ ను ప్రకటించారు.
 
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఇది వారి మునుపటి స్మాష్ హిట్ 'అఖండ' కు ఇది సీక్వెల్, మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇటీవలే ఘనంగా లాంచ్ అయిన మూవీ, బాలకృష్ణ డే వన్ జాయిన్ కావడంతో 'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. బోయపాటి తనదైన స్టయిల్ లో బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఈ ఫైట్ సీక్వెన్స్ ని సూపర్ వైజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్ జరుగుతోంది.
 
ఈ సందర్భంగా మేకర్స్ లాంఛింగ్ ఈవెంట్ నుంచి గ్రిప్పింగ్ మూమెంట్‌ను ప్రజెంట్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.“ఈ నేల అసురుడిది కాదు రా... ఈశ్వరుడిది... పరమేశ్వరుడిది... కాదని తాకితే జరిగేది తాండవం... అఖండ తాండవం. .." అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌ని చెప్పారు బాలకృష్ణ.  
 
థమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా సీన్ ఇంటన్సిటీ మరింత పెంచింది, మ్యూజిక్ ఎడిషినల్ ఎనర్జీ, ఎక్సయిట్మెంట్ ని యాడ్ చేసింది. దసరాకి సెప్టెంబర్ 25, 2025న సినిమా విడుదలవుతుందని వీడియో ద్వారా రివిల్ చేశారు. 
 
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. 
 
బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ మేడిన్ పాన్ ఇండియా మూవీ'అఖండ 2 'ఇండియా అంతటా విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు