ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా అక్కడ కొన్నాళ్లపాటు భారీ షెడ్యూల్ జరగనుండగా మరికొన్నాళ్లు అక్కడే బస చేయనుంది యూనిట్. కాగా నిన్న అక్కడి ఓ రెస్టారెంట్ లో ఒక కుటుంబంతో కలిసి టిఫిన్ చేసిన బాలకృష్ణ, అక్కడ తాను ఫుడ్ తిన్నాక టాబ్‌లెట్లు వేసుకుంటున్నాని అంటూ అక్కడి వారితో చెప్పి ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా అక్కడ తన దగ్గరకు వచ్చి మహిళని చూస్తూ ఎక్కువగా ధారావాహికలు చూస్తూ మెదడు పాడుచేసుకుంటుంటారు, నేను టీవీలు పెద్దగా చూడను. టివి చూడడం ఎంత తగ్గిస్తే మెదడుకి అంత మంచిదని భావిస్తాను అంటూ ఆయన సరదాగా మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయనతోపాటు కూర్చున వ్యక్తి దీన్ని షూట్ చేసి పెట్టారు.