Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

చిత్రాసేన్

శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:07 IST)
Nandamuri Tejaswini
తన తాతగారు నటసార్వభౌమ, యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరామారావు, తండ్రి నటసింహం  నందమూరి బాలకృష్ణ గారి మహత్తర వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళుతూ శ్రీమతి నందమూరి తేజస్విని ప్రముఖ ఆభరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అద్భుతమైన ఆరంగేట్రం చేశారు. ఆమె భర్త మతుకుమల్లి శ్రీ భరత్, విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందిస్తున్న గౌరవనీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు.
 
సిద్ధార్థ ఫైన్ జువెలర్స్‌తో తేజస్విని ఈ అనుబంధం, నందమూరి కుటుంబానికి, తెలుగు సినీ అభిమానులకు ఒక సంతోషకర ఘట్టంగా నిలిచింది. ఇది తేజస్విని గారి కళాత్మక ప్రయాణానికి కొత్త ఆరంభం మాత్రమే కాదు, నందమూరి కుటుంబం ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగించే మరో అద్భుత అడుగుగా నిలుస్తోంది.
 
తొలిసారి తెరపై కనిపించిన తేజస్విని తన అద్భుతమైన చరిస్మా, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె గ్రేస్, హావభావాలు మంత్ర ముగ్ధులను చేశాయి. నందమూరి వారసత్వానికి తగినట్టుగా నటనలోనూ, నృత్యంలోనూ తేజస్విని తన ప్రతిభను చాటుకుంది. ఇది ఆమె తొలి ప్రయత్నం అయినప్పటికీ, అనుభవజ్ఞురాలిలా ఆత్మవిశ్వాసంగా, సహజంగా నటించి తన తాత, తండ్రి చూపిన సినీ ప్రతిభను గుర్తు చేసింది.
 
ఈ బ్రాండ్ ప్రమోషనల్ వీడియోను దర్శకుడు డి. యమున కిషోర్ అద్భుతంగా తెరకెక్కించారు. తేజస్విని గారి చార్మ్, ఎలిగెన్స్ ని  అందంగా చిత్రీకరించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ రాయల్ లుక్ తీసుకొచ్చింది. ఎస్‌.ఎస్‌. థమన్ అందించిన బ్యూటీఫుల్ మ్యూజిక్  ప్రతి ఫ్రేమ్‌కి పండుగ వాతావరణాన్ని తీసుకురాగ, అయాంక బోస్ సినిమాటోగ్రఫీతో ప్రతి షాట్‌ని విజువల్ ఫీస్ట్ గా నిలిపారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్‌, నవీన్ నూలి ఎడిటింగ్‌ తో పాటు ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తన లెన్స్‌లో తేజస్విని గారిని అద్భుతంగా చూపించారు.
 
కంపెనీ డైరెక్టర్లు సెలబ్రిటీ డిజైనర్ శ్రీమతి నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమతి శ్రీమణి మతుకుమిల్లి,  శ్రీమతి శ్రీదుర్గ కాట్రగడ్డ హాజరైన విలేకరుల సమావేశంలో శ్రీ వేమూరి కృష్ణ ప్రసాద్, సంస్థ తరపున మాట్లాడుతూ, శ్రీమతి నందమూరి తేజస్వినితో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
 ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ఉత్సాహంగా, నిబద్ధతతో పూర్తి చేసిన టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు  తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు