ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమా ఇది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.. అని తెలిపారు.
హీరోయిన్ స్మృతి వెంకట్ మాట్లాడుతూ.. ఈ పాత్రకు నన్ను సెలక్ట్ చేసినందుకు సర్వoత్ రామ్ క్రియేషన్స్ నిర్మాతగారికి, దర్శకుడికి ధన్యవాదాలు. మధుబాలగారితో నటించడం ఇట్స్ మై డ్రీమ్. సినిమా బ్యానర్ లాగే కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.. అని తెలిపారు.
నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ.. ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్‌గారు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాలగారు ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుండి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది అని అన్నారు.
నటీనటులు:
నవీన్ చంద్ర, స్మృతి వెంకట్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధుబాల, రఘుబాబు, అచ్యుత్ కుమార్, సత్యం రాజేష్, మీమీ గోపి, పూజా రామచంద్రన్, సుదర్శన్, నవీన రెడ్డి, సిరి శ్రీ, ఆదర్శ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.