కొత్త బిజినెస్ ప్రారంభించిన నయనతార

శనివారం, 31 జులై 2021 (15:35 IST)
దక్షిణాది చిత్రసీమలో అగ్రనటిగా ఉన్న నయనతార ఇపుడు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ 'చాయ్ వాలే'లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఈ సంస్థకు రూ.5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ల పెట్టుబడులు కూడా ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే, 'చాయ్ వాలే' బిజినెస్ విషయంలోకి వెళ్తే... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. మరోవైపు నయన్, విఘ్నేశ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు