విడుదలకు సిద్దమైన నిఖిల్, అనుపమ 18 పేజెస్ ట్రైలర్

గురువారం, 15 డిశెంబరు 2022 (18:24 IST)
Nikhil Siddharth & Anupama Parameswaran
నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం "18 పేజిస్". జీఏ 2" పిక్చర్స్,  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇటీవలే ఈ "18పేజిస్" టీజర్ కి, "నన్నయ్య రాసిన" అలానే "టైం ఇవ్వు పిల్ల" అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన "ఏడు రంగుల వాన" అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఈ తరుణంలో ఈ చిత్ర యొక్క థియేట్రికల్  ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.   ప్రొమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు అనుపమ & నిఖిల్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు