హీరో నిఖిల్ ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకున్నారు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌కు చెందిన భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు నిఖిల్. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రంలో నిఖిల్ కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు.