నిఖిల్ పాన్ ఇండియా సినిమా అని రిలీజ్ చేసిన స్పై చిత్రం విడుదల తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. కానీ రోజు రోజు కలెక్షన్ అదుర్స్ అని పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఓవర్ సీస్ బ్రహ్మాండం అన్నారు. కానీ ఈరోజు తిరుగుటపా అన్నారు. అంటే ఇప్పటివరకు ఫేక్ రిపోర్ట్స్ అని తేలిపోయింది. ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదలచేస్తున్నట్లు మొదట చెప్పారు. కానీ తొలుత తెలుగులోనే రిలీజ్ అని విడుదలకు ముందు తెలిపారు. తమిళ, మలయాళం, కన్నడ డబ్బింగ్లో వున్నాయని, హిందీలో టైం సరిపోవడంలేదని అన్నారు. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమాను బ్రహ్మాండంగా విడుదలచేయాలని చూశారు. ఓవర్ సీస్ లో 594+ కౌంటింగ్ అని పోస్టర్ విడుదల చేశారు. కానీ షెడెన్గా ఈరోజు జులై 5న హీరో నిఖిల్ ఓ ప్రకటన జారీ చేశారు. ఓవర్సీస్లో 350 తెలుగు ప్రీమియర్ షోను కాన్సిల్ చేయడం జరిగిందని తెలిపారు.