రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు.. ''విశ్వాసం'' అజిత్ క్లారిటీ

మంగళవారం, 22 జనవరి 2019 (11:17 IST)
రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ హీరో అజిత్ స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. వదంతులకు దూరంగా వుండాలని.. తన వరకు తాను వదంతులను నమ్మనన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని తేల్చి చెప్పారు.


సినిమాలే తన జీవితమని.. కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాలపై వచ్చిన వదంతుల వల్ల తాను అభిమానులకు దూరమయ్యానని.. ఇక తనకు, తన అభిమానులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. 
 
తాను ఇంతగా క్లారిటీ ఇచ్చినా కొన్ని పార్టీలు తన పేరును ఉపయోగించుకుంటున్నాయి. రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని.. సాధారణ ప్రజల మాదిరిగానే తాను లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటాను.
 
''నా అభిమానులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టండి. అభిమానుల్లో ఎందరో నిరుద్యోగులు ఉంటారు వారందరూ ఉద్యోగ సాధనపై ఏకాగ్రత ఉంచండి. ఉద్యోగులు మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చండి. ఆరోగ్యంగా ఉండండి. లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడండి' అని అభిమానులకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు