బిగ్ బాస్ నాలుగో సీజన్‌.. కెప్టెన్‌గా అమ్మ రాజశేఖర్ ఓవరాక్షన్

శనివారం, 7 నవంబరు 2020 (12:18 IST)
Amma Rajasekhar
బిగ్ బాస్ నాలుగో సీజన్‌ తొమ్మిదో వారం నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా 'రింగులో రంగు' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ టాస్కులో మాస్టర్ హారిక మీద పడి ఆమె టీషర్ట్‌ను రంగుతో నింపాడు. అరియానా మీద కూడా రంగు పడింది. ఇక తనపై రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ ఈ వారం కెప్టెన్ అయ్యాడు. 
 
కెప్టెన్ అయ్యాడో లేదో.. ఇక తన ప్రతాపాన్ని చూపడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా తన టీమ్ అయినా అవినాష్‌ని రేషన్ మేనేజర్‌గా, అరియానాను తన అసిస్టెంటుగా నియమించుకున్నాడు. అయితే మామూలుగానే మాస్టర్‌ను ఆపడం కష్టం.. ఇక ఇంటి కెప్టెన్ అవ్వడంతో తన లోని ఫ్రస్టేషన్ అంతా బయటకు తీస్తున్నాడు. ఆయన కెప్టెన్‌ అవ్వడంతో ఆయనకు పడని అభిజిత్‌, అఖిల్‌, హారికలకు చుక్కలు చూపిస్తున్నాడు. 
 
అందులో భాగంగా పనులను పంచే విషయంలో పక్షపాతం చూపించాడు. తనకు అనుకూలంగా ఉండే అవినాష్‌, మోహబూబ్‌‌లకు చిన్న పనులు ఇచ్చాడు. ఇక అరియానాకు అసలు ఏం పని లేకుండా తన అసిస్టెంట్‌గా ఉండమన్నాడు. ఇక హారికకు వంట పనితో పాటు క్లీనింగ్‌ పని కూడా ఇచ్చాడు. దీంతో హారిక వ్యతిరేకించింది. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయని స్పష్టం చేసింది. 
 
మరోవైపు కొందరు ఇంటిసభ్యులు అమ్మ రాజశేఖర్‌ ఇచ్చిన పనుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. అది అలా ఉంటే గత కొన్ని రోజులుగా అమ్మ రాజశేఖర్‌ తీరుపై అటు ఇంటి సభ్యులు.. ఇటు బయట ప్రేక్షకులు అసహనంతో ఉన్నారు. నెట్టింట అమ్మ రాజశేఖర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు