చిన్న చిన్న వేషాలు వేసి 150 సినిమాలలో చేసిన గడ్డం నవీన్ జబర్దస్త్ అనే టీవీ ప్రోగ్రాం అతని కెరీర్ ను మార్చిసింది. ఆయా తాజాగా మాట్లాడుతూ, నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. జబర్ధస్త్ నుంచి వేణు, శాంతకుమార్, అధిరే అభి, రాకింగ్ రాకేష్ దర్శకులుగా మారారు. మరికొంతమంది హీరోలు అయ్యారు. దానికి ఎన్నో తెలివితేటలు కావాలి. కాబట్టి నేను నిర్మాతగా హిట్ కొట్టాలన్నదే నా లక్ష్యం. ఎప్పటికైనా నిర్మాతగా ఓ సినిమా చేస్తా. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలనేదే నా డ్రీమ్
- మొదట్లో అందరిలా సినిమా ఆఫీస్ ల చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ సెలెక్ట్ చేశారు. కానీ ఏజ్ సూట్ అవ్వడంలేదని పంపిచారు. అప్పుడు నా స్టైల్ చూసి ఏదో ఒక అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా వచ్చాయి. రాంసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, బ్యాడ్ బాయ్స్ సినిమాలు చేశాను.. ఆ తర్వాత విలన్ గ్యాంగ్స్ లో ఎక్కువగా నటించాను. కానీ జబర్ధస్త్ ఎంట్రీ తర్వాతే గుర్తింపు లభించింది. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి , అదిరే అభి, చలాకీ చంటి వాళ్ల వల్ల నాకు జబర్ధస్త్ లోకి ఎంట్రీ దొరికింది.. అదిరే అభి ప్రోత్సాహంతో మరిన్ని అవకాశాలు దక్కాయి. వారికి ఎప్పటికి రుణపడి ఉంటాను.
- హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. బ్రహ్మనందం, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ.. వంటి వారి స్పూర్తి వల్ల కామెడి పాత్రలు కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది.