యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ హీరోలిద్దరూ ఓ తమిళ మూవీ రీమేక్ రైట్స్ కోసం ట్రై చేసారట. కానీ.. తమిళ్‌లో ఆ సినిమాని నిర్మించిన నిర్మాత మాత్రం నో చెప్పారట. ఎందుకంటే.. తెలుగులో ఆ సినిమాని తన కుమారుడుతోనే రీమేక్ చేయాలనుకున్నారట. అనుకోవడం ఏంటి అలాగే చేసారు. ఇంతకీ.. ఎన్టీఆర్, చరణ్ రీమేక్ చేయాలనుకున్న ఆ సినిమా ఏంటి..? తెలుగులో ఆ సినిమాని చేసింది ఎవరంటారా..?
ఆ సినిమా పందెం కోడి. తెలుగులో చేసింది ఎవరో తెలుసుకదా. ఎస్... హీరో విశాల్. విశాల్ ఫాదర్ ఈ చిత్రాన్ని తమిళ్ నిర్మించారు. అక్కడ పెద్ద హిట్ అయినప్పుడు ఎన్టీఆర్, హరికృష్ణలతో ఈ సినిమాని రీమేక్ చేద్దామని కొంతమంది నిర్మాతలు సంప్రదించారట. అలాగే చరణ్‌తో రీమేక్ చేద్దామని రైట్స్ కోసం మరో నిర్మాత కూడా సంప్రదించారట.