"ఎవ్రీథింగ్"కు అవార్డుల పంట.. ఆస్కార్ వేదికపై సత్తా చాటిన 'నాటు నాటు' సాంగ్
సోమవారం, 13 మార్చి 2023 (12:00 IST)
ఆస్కార్ 2023లో హాలీవుడ్ చిత్రం "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీ ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. అలాగే, తెలుగు చిత్రం "ఆర్ఆర్ఆర్"లోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వరించింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా సోమవారం ఆస్కార్ అవార్డు వెల్లడి, ప్రదానోత్సవ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఇందులో "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" అనే చిత్రం ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది.
ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటితో పాటు మరికొన్ని విభాగాల్లో అవార్డులు వరించాయి. మరోవైపు, మన దేశం నుంచి నామినేట్ అయిన 'ఆర్‌ఆర్‌ఆర్', 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' సైతం ఆయా విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి. ఆస్కార్ 2023 అవార్డులు పొందిన చిత్రాల వివరాలను పరిశీలిస్తే,
ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు : డానియెల్ క్వాన్, డానియెల్ షైనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు : బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి : మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ సహాయ నటుడు : కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి : జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)