నలుపు డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా పవన్ కల్యాణ్ (video)
సోమవారం, 30 జనవరి 2023 (12:36 IST)
Pawan Kalyan
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో మూవీ ఫేమ్ దర్శకుడు సుజీత్ కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం చేతులు కలిపారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది.
పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను నలుపు డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ వేడుకకు నటుడి ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు నటించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెలువడే అవకాశం ఉంది.