ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదాయకం. ఆర్.ఆర్.ఆర్. చిత్రం ద్వారా తెలుగు సినిమా పాటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంఘ సేవకులు డా.సంకురాత్రి చంద్రశేఖర్ గారిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషాన్ని కలిగించింది. పేదలకు ఉచితంగా కంటి వైద్యం, శస్త్ర చికిత్సలు అందించడంతోపాటు ఉచిత విద్య అందించే సేవలు ఎంతో విలువైనవి. తెలంగాణకు చెందిన భాషా శాస్త్రవేత్త శ్రీ బి.రామకృష్ణా రెడ్డి గారికి పద్మశ్రీ పురస్కారం దక్కడం భాషకు ఇచ్చిన పురస్కారమే. ముఖ్యంగా గిరిజన భాషలపై ఆయన చేసిన పరిశోధనలు, నిఘంటువుల రూపకల్పన అమూల్యమైనవి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన శ్రీ సి.వి.రాజు, శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వర రావు, శ్రీ ఎం.విజయ గుప్తా, డా.పసుపులేటి హనుమంత రావు, శ్రీ కోట సచ్చిదానంద మూర్తి గార్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.