పవన్‌ ఇచ్చిన డిస్కౌంట్‌... సర్దార్ గబ్బర్‌సింగ్ లాస్ అయినవారికి...

మంగళవారం, 17 మే 2016 (17:58 IST)
తను తీసిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్‌ కావడంతో వారంతా ఆయన్ను కలవడం ఎంతో కొంత ఇస్తానడం జరిగిందే. కాగా, త్వరలో ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడు. తమిళ 'వీరం' మూలకథ ఆధారంగా రూపొందబోతుంది. ఈ చిత్రానికి 'సేనాపతి' అనే పేరు కూడా పరిశీలనలో వుంది. ఈ చిత్రాన్ని కూడా పవన్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌ నిర్మిస్తున్నాడు. 
 
అయితే.. ఈ సినిమాను మాత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కొన్న డిస్ట్రిబ్యూటర్లే ఇవ్వాలనీ, అది కూడా 25 శాతం తగ్గించి ఇవ్వాలని పవన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి నిర్మాత శరద్‌మరార్‌ కూడా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి అనూప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రుతి హాసన్‌ నాయికగా నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి