పవన్ కల్యాణ్‌తో కీర్తి సురేష్.. పెళ్ళి పనుల్లో సమంత బిజీ.. అందుకే కీర్తికి ఛాన్సిచ్చిన త్రివిక్రమ్..

గురువారం, 17 నవంబరు 2016 (12:58 IST)
త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేదీ సినిమా హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు తర్వాత మళ్లీ పవన్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుందని టాక్ వస్తోంది. అయితే అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్న త్రివిక్రమ్ ఈసారి.. ఆమెను పక్కనబెట్టేశాడు. 
 
చైతూతో పెళ్ళి పనుల్లో ఆమె బిజీగా ఉందనుకున్న త్రివిక్రమ్.. కీర్తి సురేష్‌ను దారికి తెచ్చుకున్నాడు. దీంతో త్రివిక్రమ్, పవర్ స్టార్ కాంబోలో త్వరలో సెట్స్ పైకి రానున్న చిత్రంలో నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. తాను పవర్ స్టార్ పవన్ సరసన నటిస్తున్నానంటూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
 
తన తదుపరి సినిమా త్రివిక్రమ్- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఉండటం పట్ల కీర్తి సురేష్ హర్షం వ్యక్తం చేసింది. ఈ చిత్రం హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లో తెరకెక్కుతుందని ఫ్యాన్స్‌తో తన సంతోషాన్ని పంచుకుంది. ఇక రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్ ఇస్తున్నారు. డిసెంబరు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి