ఇటీవల అడివి శేష్‌తో యూరోపియన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన వామికా ఈ చిత్రం గురించి ఉత్సాహంగా ఉన్నారు. “G2 అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటి చిత్రం చెప్పుకోదగ్గ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది, ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆనందంగా, సవాలుగా ఉంటుంది. ప్రతిభావంతులైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడం నాకు స్ఫూర్తినిస్తుంది' అన్నారు
అడివి శేష్, వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ తో పాటు మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు షాలిని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ యాక్షన్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ డ్రామాతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ -ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన జి 2 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ విడుదల కానుంది.