వకీల్ సాబ్‌లో లాయర్.. హరీష్ శంకర్ సినిమాలో లెక్చరర్.. (video)

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (15:39 IST)
అవును.. పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ రోల్ చేస్తున్నారు. మరోవైపు వకీల్ సాబ్‌కు తర్వాత పవన్‌ తదుపరి చేయబోయే హరీశ్‌ శంకర్‌ సినిమాలో లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ 'వకీల్‌సాబ్‌' సినిమా బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. 
 
అలాగే పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'గబ్బర్‌సింగ్‌' ఇండస్ట్రీ హిట్‌ సాధించిన నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న మరో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లెక్చరర్ రోల్‌లో పవన్ కల్యాణ్ అదరగొడతాడని టాక్ వస్తోంది. గతంలో పవన్‌ను హరీశ్‌ శంకర్‌ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించనున్నారనే టాక్‌ కూడా వినిపించింది.
 
అయితే తాజాగా ఇప్పుడు పవన్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. మైత్రీమూవీమేకర్స్‌ బ్యానర్‌లో హరీశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ 2021 మధ్యలో ప్రారంభం అవుతుందని.. ఇందులో పవన్ కల్యాణ్ సరసన గార్జియస్ గర్ల్ పూజా హెగ్డే నటించబోతుందని తెలుస్తోంది.


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు