కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మ్యాడ్ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయారు. కథ ప్రకారం నలుగురు వ్యక్తులు అలానే ప్రవర్తించాలి. కొందరు ఫస్టాఫ్ బాగుందనీ, సెకండాఫ్ బాగోలేదని రాశారు. మ్యాడ్ సినిమా కంటే సీక్వెల్ బాగోలేదని కొందరు రాశారు. అసలు ప్రేక్షకులు మాత్రం మ్యాడ్ సీక్వెల్ చాలా బాగుందని తీర్పు ఇచ్చారు. రివ్యూలు రాసేవారు ఇంటిలో ఏదో ప్రాబ్లమ్ తో సినిమా చూస్తే అది రివ్యూపై పడుతుందని ఎద్దేవా చేశారు. మా సినిమాతోపాటు మోహన్ లాల్, విక్రమ్, నితిన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమా ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. కానీ మా సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజే 17 కోట్ల గ్రాస్ తెచ్చుకుందని నిర్మాత తెలిపారు.