నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ఠాగూర్

బుధవారం, 5 మార్చి 2025 (09:56 IST)
హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సినీ నేపథ్యం గాయని కల్పన ఆరోగ్యంపై ఆమె అభిమానులు, సహచర నేపథ్యగాయనీ గాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి వెంటిలేటరుపై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పలువురు ఆస్పత్రికి వస్తున్నారు. వీరిలో గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వారంతా వైద్యులను అడిగి సునీత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. 
 
హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో ఉంటున్న కల్పన మంగళవారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆమె ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న కల్పన భర్త ప్రసాద్ హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు సమాచారం. ఆయన వద్ద విచారణ జరిపితేగానీ సునీత ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. 


 

#Tollywood singer Sunitha and others singers reached to Holistic Hospital at Nizampet where #Singer Kalpana has been admitted..yet to know the reasons for Kalpana’s suicide..police investigation is underway.. pic.twitter.com/zRAIgEUAXn

— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) March 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు