చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు. సినిమా లొకేషన్‌లో తమ కారావాన్లు కూడా సెట్‌కు దూరంగా ఉంటాయని, కొన్నిసార్లు సినిమా వాల్ పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని ఆమె విమర్శించారు.
సాధారణంగా చిత్రపరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారన్నది జగమెరిగిన సత్యం. దీనిపై పూజా హెగ్డే స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లలో హీరోలు కారావాన్లు సెట్‌కు దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని వాపోయింది. తాము పొడవైన, బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ అంతదూరం వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇకపోతే, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో రజనీకాంత్, విజయ్, సూర్య, షాహిద్ కపూర్ చిత్రాలు ఉండటం గమనార్హం.