సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న భారీ అంచనాల సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ వెబ్‌సైట్ ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం కథ, సులోచనా రాణి నవలల నుండి ప్రేరణ పొందింది. గుంటూరు కారం కథాంశం సులోచనా రాణి కీర్తి కీర్తనలు నవల నుంచి రూపొందించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గురించి రాసింది. గుంటూరు కారం కాపీ స్టోరీగా ప్రచారం చేసిన వెబ్‌సైట్ పోస్ట్‌ను షేర్ చేస్తూ, పూనమ్ కౌర్ ఎక్స్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.