ఐతే మరుసటిరోజు తను చనిపోలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది పూనమ్. కేవలం గర్భాశయ కేన్సర్ పైన ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డట్లు వివరించింది. ఐతే దీనిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు ఇలాంటి దారిని ఎంచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరికొందరైతే పూనమ్ పాండేపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే... పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త తెలిసి తనకేమీ బాధ కలగలేదని ఆమె భర్త సామ్ బాంబే అన్నారు. ఆమెతో కనెక్ట్ అయి వున్నవారు ఆమె చెప్పే మాటలు ఎలా వుంటాయో ఇట్టే అర్థమవుతుందని అన్నాడు. నేను ప్రతిరోజూ ఆమె గురించి విపరీతంగా ఆలోచిస్తాననీ, అందువల్ల ఆమె చనిపోయి వుండదని నాకు ఎక్కడో అనిపించిందనీ, బతికే వున్నందుకు సంతోషంగా వుందని చెప్పాడు. పూనమ్ పాండే- సామ్ బాంబేకి 2020లో పెళ్లయ్యింది. ఐతే తనను హింసిస్తున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టి అతడితో విడిపోయింది పూనమ్ పాండే.