"ఈ భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవింపబడుతూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. సాధారణ యువతులు దేనిపైనైనా స్పందిస్తే.. వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ, నిందలు వేస్తూ ఉపయోగంలేని వారిగా చూపిస్తూ.. సంబంధంలేని వాటిని వారిపై అంటగడుతున్నారు. అంతా కలిసి అలాంటి యువతుల ఆత్మను, మనస్సును, శరీరాన్ని చంపేసేందుకు సిద్ధమవుతున్నారు" అంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు.
కాగా, గత కొన్ని రోజులుగా హీరో పవన్ కళ్యాణ్ అభిమానలకు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్, ఆ తర్వాత కత్తి మహేష్ సంధించిన 6 ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు. ఈ వివాదానికి, నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి ఇందులోకి నన్ను లాగొద్దు, పవన్ కల్యాణ్ గారు దీనిని పరిష్కరించండి అంటూ ట్వీట్ చేసి, ఆ తర్వాత కత్తి మహేష్ వాళ్ల అమ్మపై నెటిజన్ చేసిన ట్వీట్‌ని ఖండిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత దాదాపు ఆమె ఎటువంటి ట్వీట్ చేయలేదు. తాజాగా ఈ విధంగా ట్వీట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.