అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. 'కస్టడీ' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.