shoba rani - prasanna kumar - tumala rama sathyanarayana and others
కే టి కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, నిర్మాతలు రమణ , మురళీధర్ పాల్గొన్నారు.