హాలీవుడ్ కార్పొట్‌పై నిల్చుని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భారతదేశ ప్రజలను గర్వపడేలా చేసింది. హాలీవుడ్ అరంగేట్రంతో గ్లోబల్‌స్టార్‌గా మారిపోయిన ప్రియాంక చోప్రా పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకొని మరోసారి భారతదేశ ప్రజల్ని గర్వపడేలా చేసింది. అంతేకాదు.. అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒక్క జవాబుతో నోటికి తాళంవేసింది.
ఈ అవార్డు అందుకోగానే ప్రియాంక వద్ద మీడియాతో ముచ్చటించింది. కొత్త అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌పై మీ అభిప్రాయం ఏంటి. మీరేమైనా భయపడుతున్నారా?' అని ఓ విలేకరి అడిగాడు. ఇందుకు ప్రియాంక.. 'నేను భారతీయురాలిని. నీకు భయంగా ఉందా?' అని ధీటుగా సమాధానం ఇచ్చింది. అయితే ఆ విలేకరి తనకు భయం లేదు కానీ మిగతా విదేశీయులకి భయం అని చెప్పి అక్కడి నుంచి ఇంకేమీ మాట్లాడలేక పక్కకి తప్పుకున్నాడు.