ప్రియాంకా చోప్రా అన్‌పనిష్డ్ బుక్ ప్రకంపనలు : బాడీ షేపులు చిన్నవిగా ఉన్నాయన్నారు..

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (14:11 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన సినీ అనుభవాలపై ఓ పుస్తకం రాశారు. అన్ ఫినిష్డ్ అనే టైటిల్‌తో ఈ పుస్తకాన్ని రాశారు. ఇందులో ఆమె అనేక సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, సినీ రంగంలో తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న అనుభవాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఇందులోభాగంగా, ఓ దర్శకుడు గురించి ఆమె రాసిన వాక్యాలు ఇపుడు బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. 
 
తన సినీ కెరీర్ ఆరంభంలో ఓ దర్శకుడు తన శరీర భాగాల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలిపింది. 'కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఓ దర్శకుడిని కలిశాను. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఆయన నన్ను లేచి నిలబడమన్నాడు. కొంత సేపు నన్ను పై నుంచి కింది వరకు చూసి.. 'నీ వక్షోజాలు, పిరుదులు చిన్నగా ఉన్నాయి. నువ్వు హీరోయిన్‌వి కావాలనుకుంటే ముందు ఆపరేషన్ చేయించుకో. అమెరికాలో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడ'ని సలహా ఇచ్చాడని ప్రియాంక పేర్కొంది. 
 
అలాగే, మరో సినిమాలో రొమాంటిక్ సాంగ్ తెరకెక్కించే సమయంలో దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అందులో ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా, "సినిమాలో అదొక ఇంటిమేట్ సాంగ్. ఆ పాటలో నేను సెక్సీగా కనిపించాలి. నా శరీరం మీద బట్టలు విప్పుతూ ఉండాలి. దీంతో నేను శరీరంపై ఎక్కువ లేయర్స్ ఉండేలా దుస్తులు ధరిస్తానని దర్శకుడికి చెప్పాను. 
 
దాంతో ఆయన నా స్టైలిష్ట్‌తో మాట్లాడారు. 'మీరు ఏమైనా చెయ్యండి. పాటలో ఆమెలో దుస్తులు కనిపించాలి. లేకపోతే సినిమా చూడడానికి ఎవడు వస్తాడ'ని అడిగారు. ఈ అంశం హీరో సల్మాన్ దృష్టికి వెళ్లింది. ఆయన జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య సద్దుమణిగిపోయిందని ప్రియాంకా చోప్రా తన పుస్తకంలో రాసుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు