నేను అది బాగా నేర్చుకుంటున్నా... పూజా హెగ్డే

శనివారం, 20 ఏప్రియల్ 2019 (19:12 IST)
మహారాష్ట్రలో పుట్టి ముంబైలో మోడలైన పూజా హెగ్డే తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేతకను సంపాదించుకుంది. అగ్ర యువ హీరోలతో నటించిన ఈ ముంబై భామ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలలో నటిస్తోంది. క్షణం కూడా తీరిక లేకుండా చాలా సినిమాలు ఉన్నాయి పూజా హెగ్డే చేతిలో. అయితే తనకు రెండే రెండు విషయాలు తెలుగు సినీపరిశ్రమలో బాగా నచ్చాయని చెబుతోంది పూజా హెగ్డే.
 
అందులో ఒకటి తనకు బాగా నచ్చింది తెలుగు పాటలని, ఖాళీ దొరికితే తెలుగు పాటలు వింటూ ఉంటానని చెబుతోంది. లైట్ మ్యూజిక్ తెలుగు సాంగ్స్ అంటే చెవి కోసుకునేంత ఇష్టమంటోంది ముంబై భామ. అందుకే తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించాలనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు బాగా నేర్చుకుంటున్నాను. ఎదుటివారు తెలుగు మాట్లాడితే నాకు బాగా అర్థమవుతుంది. కానీ నాకు మాట్లాడడం రాదు. రెండు, మూడు పదాలు మాట్లాడగలను. అంతే కానీ త్వరగా తెలుగు నేర్చుకుంటానన్న నమ్మకం మాత్రం ఉందని చెబుతోంది పూజా హెగ్డే.
 
తెలుగులోనే కాదు హిందీ బాషల్లోను పూజా హెగ్డేకు అవకాశాలు తన్నుకొస్తున్నాయి. కనీసం తన స్నేహితులతో కలిసే సమయం కూడా లేకుండా పోతోందని ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ తెగ బాధపడిపోతోంది పూజా. జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, రాంచరణ్ ఇలా ఎంతోమందితో కలిసి నటించిన పూజా హెగ్డే మరికొంతమంది యువ హీరోలతో జతకట్టబోతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు