టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ జగన్నాథ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసారు. నటి శ్యామల వుంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటికీ వెళ్లి ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు.
పావలా శ్యామల వయోభారం తెచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గతంలో తను ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. తన దీన స్థితిని తెలియజేస్తూ ఇటీవల వీడియో ద్వారా అభ్యర్థించారు.
తన ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగా లేదనీ, తనకు సాయం చేయాలని వేడుకున్నారు. తను పెద్దపెద్ద నటుల సినిమాల్లో నటించాననీ, వారిలో ఎవరైనా పెద్దమనసు చేసుకుని తనకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని చెప్పారు. ఈ వీడియోను చూసిన ఆకాశ్ స్వయంగా శ్యామల వుంటున్న వృద్ధాశ్రమానికి వెళ్లి పరామర్శించారు.