సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా జంటగా నటించిన "పుష్ప-2" చిత్రం ఈ నెల 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. భారత్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షోలు డిసెంబరు 4వ తేదీ రాత్రి నుంచే ప్రదర్శించనున్నారు. అలా మొత్తం 80 దేశాల్లో ఆరు భాషల్లో 55 వేల ఆటలను ప్రదర్శించనున్నారు.
అలాగే, ఈ చిత్రం ప్రీరిలీజ్ వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. రూ.670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇకపోతే, ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో రూ.400 కోట్ల మేరకు వ్యాపారం జరిగింది.
టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఊ చిత్రం రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా ఒక మిలియన్ టిక్కెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ టిక్కెట్లన్నీ కేవలం బుక్ మై షోలో అమ్ముడు పోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో అయితే, బుకింగ్ తెరిచిన తొలి అర్థగంటలోనే టిక్కెట్స్ అన్నీ అమ్ముడు పోవడం గమనార్హం.