మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్ ఇస్తున్నారు మేకర్స్... ఇక డిసెంబరు 6న అందరూ డబుల్ మార్క్ చేసుకొని రెడీ వుండడి..!
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్