అతి తక్కువ సమయంలోనే ట్రిపుల్ ఆర్, బాహుబలి రికార్డులను దాటేసింది. విడుదలైన తొలి వారానికే పరిస్ధితి ఇలా ఉంటే థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు రాబట్టలేదు. ఇప్పటికే చాలా పెద్ద సినిమాల రికార్డులను తుడిచి పెట్టేస్తోంది.