సినీ నటుడు రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. లావణ్య, మాల్వీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటుండడంతో ఈ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూ తాజాగా ఓ కొత్త టర్న్ తీసుకుంది. బుధవారం లావణ్య మరోసారి రాజ్ తరుణ్, మాల్వీలపై ఫిర్యాదు చేసింది.
అంతే కాకుండా పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు ఇచ్చినట్లు సమాచారం. వాటిలో రాజ్ తరుణ్‌తు ఉన్న 170 ఫొటోలు, ఇంకా పలు టెక్నికల్ అండ్ మెడికల్ ఎవిడెన్స్‌లు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.