ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం నాడు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. ఇక తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడు అయిన రాజ్ మరణించిన వార్త తెలుసుకున్న కోటి కన్నీరు పెట్టేసుకున్నారు.