నా రక్తం మీ రక్తం వేరు కాదు. మనమంతా ఒక్కటే. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నా సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి రెండేళ్లు దాటింది. అయినా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మీరు చూపించిన రెస్పాన్స్ కు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే 'కంగువ' లాంటి గొప్ప సినిమా చేశాను. అందుకే రెండున్నరేళ్ల టైమ్ తీసుకుని మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీని చేశాం అని కథానాయకుడు సూర్య అన్నారు.
సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. 'కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సూర్య పలు విషయాలు తెలిపారు. కంగువా సినిమా దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన ఎంతో ప్యాషన్ తో 'కంగువ'ను తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ రాక్ స్టార్ దేవికి, నా సినిమాటోగ్రాఫర్ వెట్రి గారికి థ్యాంక్స్. 'కంగువ' లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి గారు స్ఫూర్తినిచ్చారు. ఆయన తన చిత్రాలతో మాకు దారి చూపించారు. కంగువ స్ట్రైట్ తెలుగు సినిమా. ఇండియన్ సినిమా. నవంబర్ 14న మన స్పెషల్ ఫిల్మ్ 'కంగువ' చూసేందుకు థియేటర్స్ కు వెళ్లండి. ఇది ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ.
నా లైఫ్ లో మీరు నా వారియర్స్. నా అభిమానులైన మీరు మీ జీవితాల్లో ఒక వారియర్ లా పోరాడి అనుకున్నది సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఆయన సమయపాలన, హార్డ్ వర్క్, ప్యాషన్ చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది. 27 ఏళ్ల నట ప్రయాణంలో నన్నెంతో ఆదరించారు. ట్రేడ్ లో ఒక మార్కెట్ ఇచ్చారు. ఇప్పుడు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యతగా భావించా. కంగువ లాంటి ప్రయత్నం చేశాను. నటుడిగా కమల్ హాసన్ గారిని చూసి ఇన్స్ పైర్ అవుతుంటా. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా కాక కాక సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. జైభీమ్ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. కంగువ కోసం ప్రతి రోజూ 3 వేల మంది వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఇంత గొప్ప సినిమా తయారైంది. అన్నారు.
దర్శకుడు శివ మాట్లాడుతూ, ఒక పీరియాడిక్ మూవీ చేయాలనే ఆలోచనతో కంగువ స్క్రిప్ట్ బిగిన్ చేశాం. వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ కథను ఒక హ్యూజ్ బ్యాక్ డ్రాప్ లో , భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కించాం. ఎంతో ప్రిపరేషన్, ప్యాషన్ తో మూవీ చేశాం. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారి సపోర్ట్ వల్లే కంగువ చేయగలిగాం. సూర్య గారికి కథ చెప్పినప్పుడు ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు శివ అని సూర్య గారు చెప్పడం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు ఎలాంటి గొప్ప ఫీలింగ్ కలిగిందో థియేటర్ లోనూ అలాంటి అనుభూతికి లోనవుతారు. మా టీమ్ అంతా 'కంగువ' కోసం ఎంతో ఇష్టంగా పనిచేశారు. మన సౌతిండియన్ మూవీస్ ను ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలో రాజమౌళి గారు చూపించారు. నాకు ఆయన ఎంతో స్ఫూర్తినిస్తారు. రాజమౌళి గారి విక్రమార్కుడు సినిమా తమిళంలో సిరుతైగా రీమేక్ చేశాను. ఆ సినిమాతో నా ఇంటి పేరు ముందు సిరుతై వచ్చింది. అలా నేను రాజమౌళి గారికి రుణపడి ఉంటాను. సీజీ వర్క్, ఎమోషన్ ఎలా బాగా హ్యాండిల్ చేయాలో ఆయన చేసి చూపించారు.. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా హార్డ్ వర్క్ చేశారు. నవంబర్ 14న 'కంగువ' మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేందుకు వస్తోంది. మా టీమ్ కు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది. సినిమా గొప్ప విజయాన్ని అందుకుంటుంది. తప్పకుండా మూవీ మీ అందరికీ నచ్చుతుంది. నవంబర్ 14న థియేటర్స్ లో మనమంతా కలుద్దాం. అన్నారు.
రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - 'కంగువ' సినిమాకు మాటలు పాటలు రాశాను. ఫస్ట్ టైమ్ దేవి శ్రీ ప్రసాద్ గారితో, డైరెక్టర్ శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. జ్ఞానవేల్ గారితో, సూర్యగారితో ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాను. సూర్య గారి కుటుంబంతో నాకు ఏదో గొప్ప అనుబంధం ఉండి ఉంటుంది. అందుకే వారితో ఇంతకాలం ట్రావెల్ చేస్తున్నాను. సూర్య అన్నకు జన్మంతా రుణపడి ఉంటాను. కంగువ థియేటర్స్ లో చూసేందుకు మీతో పాటూ నేను వెయిట్ చేస్తున్నా. అన్నారు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి మాట్లాడుతూ - 'కంగువ' సినిమాను నైజాంలో ఏరియాలో మా మైత్రీ ద్వారా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. సూర్య గారి అభిమానుల కోసం ఎర్లీ మార్నింగ్ షోస్ వేయడానికి ట్రై చేస్తున్నాం. మా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే స్టార్స్ లో సూర్య గారు ఒకరు. కంగువ సీన్స్ కొన్ని చూశాను. అద్భుతంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి ఉన్న టేస్ట్ 'కంగువ'లో కనిపిస్తోంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.