కుటుంబ కలహాలు... షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ ఆత్మహత్య

సెల్వి

బుధవారం, 12 జూన్ 2024 (10:03 IST)
షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోరబండలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివ నాలుగు నెలలుగా బోరబండలో ఉంటున్నారు. ఒంటరితనం, మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
 
కుటుంబ కలహాలే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శివ సినిమాలకు కో-డైరక్టర్, స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. శివ ఇంట ఐదు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. అతడు మృతి చెంది మూడు రోజులు వుంటుందని ప్రాథమిక అంచనా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు