గత ఏడాది నుంచి షూటింగ్ కు లొకేషన్ వేటను రాజమౌళి మొదలు పెట్టారు. అందులో భాగంగా డిసెంబరులో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌ని పరిశీలించారు. ఈ సినిమాలో దాదాపు ఇండియన్, ఫారిన్ కు చెందిన ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ఇప్పటికే ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పేరులు వెలువడ్డాయి. రెండు ఏళ్లుగా ఈ సినిమా కథపై రచయిత విజయేంద్రప్రసాద్ కసరత్తు చెస్థున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.