బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టాలని చూస్తున్న దర్శకుడు, సాధ్యమేనా? (video)

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (15:33 IST)
బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నందమూరి, మెగా అభిమానులు మాత్రమే కాకుండా సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 2021 జనవరి 8న ఆర్ఆర్ఆర్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
 
బాహుబలి సినిమాతో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని సాధిస్తాడనేది ఆసక్తిగా మారింది. మగధీర సినిమాకి 40 కోట్ల బడ్జెట్ అయ్యిందని వార్తలు వచ్చినప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 40 కోట్లు వసూలు చేయడం కష్టం అనుకున్నారు కానీ.. మగధీర సినిమాకి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వసూలు చేసింది. అప్పట్లో మగధీర సినిమాతో రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. 
 
మగధీర రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో కుదరదని అంతటి విజయాన్ని సాధించింది అంటూ స్పందించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 
 
ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సినిమా తీసారు. ఈ సినిమా ఏ స్ధాయి విజయం సాధించిందో తెలిసిందే. అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. బాహుబలి రికార్డులను బాహుబలి 2 సినిమాతో మళ్లీ రాజమౌళినే బ్రేక్ చేసారు. బాహుబలి 2 సినిమాతో 1000 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించారు. 
 
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి టార్గెట్ ఏంటి అనే చర్చ జరుగుతుంది. మేటర్ ఏంటంటే... ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 
 
బాహుబలి, బాహబలి 2 సినిమాలు గ్రాఫిక్స్ మాయాజాలంతో విజువల్ వండర్ అనేలా అద్భుతంగా రూపొందించారు. అందుకనే ఆ సినిమాలకు అంతటి అద్భుత విజయం దక్కింది. 
 
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా విజువల్ వండర్ అనేలా రూపొందిస్తున్నారట జక్కన్న. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఆరు నెలలు సమయం కేటాయించారు. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా... ఓ కొత్త అనుభూతి కలిగించేలా ఆర్ఆర్ఆర్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ మూవీతో బాహుబలి 2 రికార్డులు క్రాస్ చేయాలనుకుంటున్నారని.. రాజమౌళి ప్రజెంట్ టార్గెట్ ఇదే అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న బాహుబలి 2 రికార్డులను క్రాస్ చేయాలనే టార్గెట్ రీచ్ అయి.. సరికొత్త రికార్డులు సాధిస్తాడని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు