ఆయనే కాదు. రాజమౌళి గారు ఫ్యామిలీ అంతా సెట్ కు వచ్చినప్పుడు అందరూ డాన్స్ చేస్తారు. వవన్ కళ్యాన్ సినిమా. `మెరికల్ తిరుగుతుంది అమ్మాయో... ` అనే సాంగ్ ను మూవ్ మెంట్ అడిగి చేనేవారు. ఆయన డాన్స్ కూడా ప్రతిదీ పరిశీలిస్తారు. డాన్స్ చేస్తే వెనుక కూడా కెమెరా పెట్టి షూట్ చేయమనేవారు. డాన్స్ కు వెనుక భాగం కెమెరా ఎందుకు అనే డౌట్ తో అడిగాను. ఆయన వివరించి చెప్పాక ఆయన టాలెంట్ అర్థమయింది. ఆర్.ఆర్.ఆర్.లో ఎన్.టి.ఆర్., చరణ్ డాన్స్ చేస్తుండగా మొత్తం కెమెరా రౌండ్ తిరుగుతుంది. అన్ని ఎమోషన్స్, మూవ్ మెంట్ చూపించి కొత్తగా చేయించేవారు. ఇక హీరోలతో డాన్స్ చేయించేటప్పుడు రాజమౌళి చేసి చూపిస్తూ.. ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేయించేవారు.