Refresh

This website p-telugu.webdunia.com/article/telugu-cinema-news/rajendra-prasad-apologizes-to-david-warner-for-his-comments-125032500031_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

ఠాగూర్

మంగళవారం, 25 మార్చి 2025 (16:48 IST)
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. వార్నర్‌కు బహిరంగ క్షమాపణలు చెపుతూ విడుదల చేసిన ఆ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియోలో "వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్" అంటూ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. "ఆ తర్వాత నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా.. యాక్టింగ్‌లోకి రా నీ సంగతి చెప్తాను అన్నాను. అతను అన్నాడు.. మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చూస్తాను.. ఇలా చాలా అల్లరి చేశాం. ఏది ఏమైనా తెలియకుండా ఎవరినైనా బాధపెట్టివుంటే, మనసు నొప్పించివుంటే మీ అందరికీ సారీ చెప్తాను. ఇక ముందు ఇలాంటివి జరగదు. జరగకుండా చూసుకుందాం. మార్చి 28వ తేదీన రాబిల్ హుడ్ చిత్రం అందరూ చూడాలని కోరుకుంటున్నాను" అని రాజేంద్ర ప్రసాద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. 
 
ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి...
 
ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ బూతులు తిట్టారు. "ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్" అంటూ హెచ్చరించాడు. 
 
టాలీవుడ్ యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌‍లో రూపొందిన చిత్రం "రాబిన్ హుడ్". ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనేక మంది నెటిజన్స్ రాజేంద్ర ప్రసాద్‌‍ను తిట్టిపోస్తున్నారు. 
 
ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, "హీరో నితిన్, దర్శకుడు వెంకీలు కలిసి ఈ వార్నర్‌ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు. 
 
అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థంకాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడమేమిటని వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్‌లో శ్రీలీల, కేతిక శర్మలతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. 

 

డేవిడ్ వార్నర్ అభిమానులకు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ

రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్, వార్నర్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్, వార్నర్ తనకు… https://t.co/4x3rgUwXg3 pic.twitter.com/Bsrh4K4V9C

— ChotaNews App (@ChotaNewsApp) March 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు