ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత కడప పెద్ద దర్గా (ఆమీన్ పీర్ దర్గా)లో సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌లు గురువారం ప్రత్యక్షమయ్యారు. తిరుమల పర్యటనకు వెళ్లిన రజనీకాంత్.. గురువారం వేకువజామున శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. అక్కడ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. అక్కడ ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పెద్ద దర్గాను దర్శనం చేసుకున్నారు.
అంతకుముందు గురువారం ఉదయం రజనీకాంత్, తన కుమార్తె ఆశ్వర్యతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వారు ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా తితిదే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.
రజనీకాంత్, ఏఆర్ రెహ్మాన్‌లు అమీన్ పీర్ దర్గా దర్శనం కోసం వస్తుండటంత జిల్లా యంత్రాంతం తగిన ఏర్పాట్లుచేసింది. కాగా, ఐశ్వర్య దర్శకత్వం వహించే కొత్త చిత్రం లాల్ సలామ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు.