ఇది చూసిన తెలుగు దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. నాకు తెలుసు రకుల్. షూటింగ్స్ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. ఇటీవల నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది, అయినప్పటికీ.. నీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అంటూ రకుల్ కి సపోర్ట్ చేశాడు హరీష్. అంతేకాకుండా నీ వర్కే వారికి సమాధానం చెబుతుందని పేర్కొన్నాడు.